KMM: పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం పాలేరు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. ఖమ్మం రూరల్ మండలం పోనేకల్లో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.