JGL: ఆధ్యాత్మికత ద్వారా మానసిక ప్రశాంతత సాధ్యమని, మన ధర్మాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణవాడలో ధ్యాన మందిరాన్ని పరిశీలించి, రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్య వైశ్య ఆధ్యాత్మిక కుటుంబం వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి SDF నిధుల నుంచి రూ.5లక్షల మంజూరు చేస్తానన్నారు.