JBL: గణపురం మండల కేంద్రంలో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ బాటసారులపై దాడులు చేస్తున్నాయి. గత రెండు రోజుల్లో ఇద్దరిపై దాడులు జరగగా, శనివారం చేరాలు అనే వ్యక్తిపై, ఆదివారం సర్దార్ అనే వృద్ధుడిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో వృద్ధుడికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. పంచాయతీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.