MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ శివశక్తి నగర్ ప్రాంతంలో ఉన్న ఎయిర్టెల్ టవర్ను తొలగించాలని డివిజన్ కార్పొరేటర్ నౌకాంత్ డివిజన్ ప్రజలతో కలిసి విజ్ఞప్తి చేశారు. టవర్ మూలంగా ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఆ కేబుల్స్ కారణంగా అవస్థలు పడుతున్నామని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలన్నారు.