TG: బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన చట్టాలను ఎన్నో రాష్ట్రాలు కాపీ కొట్టాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి చేసిన ఖర్చు రూ. 1,395 కోట్లు మాత్రమేనని అన్నారు. కానీ తమ హయాంలో ఎస్సీల సంక్షేమానికి రూ. 7వేల కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీల మీద రేవంత్ రెడ్డికి ఉన్నది కపట ప్రేమ అని విమర్శించారు.