TG: మంత్రి పొంగులేటిని కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి చేశారని ప్రజలకు అర్థమయ్యిందన్నారు. అవినీతి జరిగినట్లు రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని.. అయితే సీబీసీఐడీ విచారణ కాదని.. హౌస్ కమిటీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పొంగులేటిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి విచారణ జరిపించాలన్నారు.