E.G: ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ రెండవ రోజు ఆదివారం రాష్ట్ర మహిళా కార్యదర్శి విజయ వాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతీయ సమగ్రత ప్రజాస్వామ్యం గాంధీయావాదం, సర్వమత సమభావన విలువలతో కూడిన రాజకీయం అంశాలపై తెలియజేశారు. అక్కిన గోపాలకృష్ణ, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింహాద్రి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.