GNTR: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషివల్లే టీడీపీ ఈ స్థాయికి ఎదిగిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు సమావేశంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. సీనియర్ కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.