ఏలూరు జడ్పీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు, సేవా భావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.