KDP: మైదుకూరు శ్రీరామ్‌నగర్‌లో సునీత అనే వివాహిత ఆదివారం తన అత్తగారింటి ముందు ధర్నాకు దిగింది. పెళ్లై మూడేళ్లయినా భర్త నవీన్ తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని, అదనపు కట్నం కోసం అత్తమామలు వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నా, తనను పీజీలో ఉంచి భర్త స్నేహితులతో ఉంటున్నాడని వాపోయింది. పోలీసులు న్యాయం చేయాలనీ కోరింది.