మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఎం.విజయ సునీత ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకుని అధికారులకు అందజేయాలని కోరారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.