ADB: తాంసీ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్‌గా (ఆర్ఐ)గా పనిచేస్తూ, రోడ్డు ప్రమాదంలో మరణించిన సంతోష్ కుటుంబాన్ని కలెక్టర్ రాజర్షిషా పరామర్శించారు. భీంపూర్ మండలం కరంజి (టి)లోని మృతుడి నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.