TPT: పిచ్చాటూరు మండలం కారూరు పంచాయితీ కృష్ణగిరి గ్రామాల వద్ద అనుమతులకు మించి గ్రావెల్ మట్టి అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 4000 క్యూబిక్ మీటర్లకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, భారీగా టిప్పర్లతో రవాణా కొనసాగుతుందని చెబుతున్నారు. హైవే దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.