SDPT: బెజ్జంకి మండలంలో బుధవారం నుంచి ఈనెల 23వ తేదీ వరకు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించాలంటే పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎస్సై సౌజన్య తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బంద్ పేరుతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలను బలవంతంగా మూసివేయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు.