వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. యుద్ధం, వాతావరణ పరిస్థితుల వల్ల వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని RBI గవర్నర్ హెచ్చరించారు. ఫిబ్రవరి నాటికి టోకు ద్రవ్యోల్బణం కూడా 3.2 శాతానికి పెరిగిందని అన్నారు. ధరల పెరుగుదల అంచనాలతో సామాన్య ప్రజల బడ్జెట్‌పై అదనపు భారం పడే సూచనలు కనిపిస్తున్నాయని RBI స్పష్టం చేసింది.