NLR: కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన టీడీపీ కుటుంబ సభ్యుడు పెపాల దర్గాబాబు విద్యుత్ షాక్కు గురై ప్రమాదవశాత్తు ఇటీవల మృతి చెందారు. టీడీపీ సభ్యత్వం కలిగి ఉండటంతో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి మంత్రి నారా లోకేశ్ పంపిన రూ.5 లక్షలను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి శుక్రవారం దర్గా బాబు భార్య హైమావతికి అందజేశారు.