CTR: అధికారులు ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి సూచించారు. రొంపిచర్లలో శుక్రవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.