SDPT: బెజ్జంకి బీసీ బాలుర వసతి గృహంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు సంక్షేమ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే బాలురకు ఉచిత వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, దుస్తులు, వైద్య సేవలు, క్రీడా సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. బీసీ, ఓసీ, ఎస్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.