చిత్తూరు జిల్లా డీఈవో రాజేంద్రప్రసాద్ గత నెల 31న పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఆ స్థానాన్ని ఇంకా భర్తీ చేయలేదు. త్వరలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త డీఈవో నియామకాన్ని వెంటనే చేపట్టాలని విద్యావర్గాలు కోరుతున్నాయి. నియామకంలో ఆలస్యం జరిగితే విద్యా పరిపాలనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.