NGKL: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను CM ఏ.రేవంత్ రెడ్డి శుక్రవారం స్వయంగా పరిశీలించారు. నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్, హెడ్ రెగ్యులేటర్, డెలివరీ సిస్టర్న్ వద్దకు చేరుకుని ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత, మిగిలి ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.