ELR: పోలవరం మండల కేంద్రంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమన్వయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.