ASR: జీకేవీధి పెట్రోల్ బంక్ రోడ్డుపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు గిరిజనులు చికిత్స పొందుతూ మృతి చెందారు. సోమవారం రోడ్డుపై నడిచి వెళ్తున్న గాసిరామ్ను బైక్ ఢీకొట్టడంతో అతడితో పాటు బైక్దారుడు బాబూరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి గాసిరామ్, ఇవాళ బాబూరావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.