BHNG: బీబీనగర్ మండలం వెంకిర్యాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రీ ప్రైమరీ తరగతి మంజూరు చేయబడింది. బోధించుటకు ప్రీ ప్రైమరీ బోధకురాలు, ఆయా నియామకం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పాఠశాల హెచ్ఎం మంజులబాయి ఒక ప్రకటనలో తెలిపారు. 10+2 ప్రాథమిక విద్య బోధనా అర్హత కలిగిన వారికి బోధకురాలిగా, 7వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి ఆయాగా అర్హత నిర్ణయించారు.