E.G: దేవరపల్లి(మం) గౌరీపట్నం పరిధిలోని కొండగూడెం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రోడ్డుపై వెళ్తున్న స్కూటీని గుర్తుతెలియని కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ముగ్గురికి గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు.