SRCL: బోయినపల్లి మండల కేంద్రంలో సహరా గ్రూప్ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేసిన బాధితులకు ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా నగదు అందించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సీపీఎం మండల కన్వీనర్ శ్రీధర్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏడాదిలోపు డబ్బులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు, షరతులు పెడుతూ ఇబ్బంది పెడుతుందన్నారు.