CTR: పుంగనూరు పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో ఆదివారం బీజేపీ పార్టీ సమావేశం జరిగింది. జిల్లా స్థాయి నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఈశ్వరమ్మను నియమిస్తూ.. జిల్లా మహిళ అధ్యక్షురాలు కవిత రాజు ప్రకటించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.