విశాఖపట్నంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి ప్రధాన కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తారు. అదేవిధంగా అన్ని జోనల్ కార్యాలయాలు, కలెక్టరేట్, సీపీ కార్యాలయాల్లో కూడా వినతులు తీసుకుంటారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.