BPT: కారంచేడు గ్రామంలోని ఆర్సీఎం చర్చిలో పామ్ సండే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. క్రైస్తవులు ప్రార్థనలు చేసి ఈత మట్టలతో గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. “హోసన్నా జయం” నినాదాలతో వీధులు మారుమ్రోగాయి. దైవ సేవకులు ఈ దినం ప్రాముఖ్యత వివరించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.