VSP: అనకాపల్లి-సబ్బవరం జాతీయ రహదారిపై ప్రేమకు జంక్షన్ వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని అతివేగంతో వచ్చిన మైనింగ్ లారీ ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి క్వారీ వాహనాల అతివేగమే కారణమని ఆరోపిస్తూ గ్రామస్తులు రోడ్డుపై ధర్నా చేపట్టారు.