MBNR: మహబూబ్నగర్లో రైల్వే లైన్ పనుల వల్ల ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న బాధితులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల పేదలు రోడ్డున పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులందరికీ సమన్యాయం చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధితులు, నాయకులు పాల్గొన్నారు.