VZM: విజయనగరం రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు శనివారం బయలుదేరవలసిన విశాఖపట్నం-దుర్గ్(20830) వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2:50 గంటలకు బదులు సాయంత్రం 4:45 గంటలకు బయలుదేరుతుందని వెల్లడించింది. ట్రాక్ పై జరుగుతున్న పలు అప్ గ్రేడ్ పనులు కారణంగా రీ షెడ్యూల్ చేస్తున్నట్లు తెలిపింది.