అన్నమయ్య: ఐపీఎల్ సీజన్ ప్రారంభం సందర్భంగా శనివారం గాలివీడు ఎస్సై నరసింహారెడ్డి యువతకు హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్‌ను వినోదంగా మాత్రమే చూడాలని, బెట్టింగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్స్ వల్ల ఆర్థిక, మానసిక నష్టాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. గాలివీడులో ప్రత్యేక నిఘా ఉంచామని, బెట్టింగ్స్‌లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.