TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ చేపడుతున్న పనులు, మైనింగ్ టెండర్లలో జరుగుతున్న అవకతవకలపై హౌస్ కమిటీ వేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని.. సంస్థకు లబ్ది చేకూరుస్తున్నారని మండిపడింది. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని పేర్కొంది. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.