SS: గుడిబండ మండలం ఎస్ఎస్ గుండ్లు గ్రామంలో తాగునీటి సమస్య నెలకొంది. గ్రామంలో తాగునీటి పైప్లైన్ లీక్ కావడంతో నీరు వృథాగా పోతున్నాయి. దీంతో గ్రామ ప్రజలు తాగునీటి సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై గ్రామ ప్రజలు పలుమార్లు పంచాయతీ అభివృద్ధి అధికారులకు తెలియజేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు.