NRML: ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి బుధ, ఆదివారాల్లో నిర్వహించే వారసంతకు సంబంధించి ఈనెల 30న వేలంపాట నిర్వహించనున్నట్లు మున్సిపాలిటీ కమిషనర్ సుందర్ సింగ్ తెలిపారు. ఆసక్తి గలవారు రూ.లక్ష డీడీ తీసి పత్రాలను 30 లోపు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ వేలం పాట మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు.