TG: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి మహా పట్టాభిషేకానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే శ్రీ లక్ష్మీ తాయరమ్మ ఆలయంలో కూడా గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.