ASF: పెంచికల్ పేట్ మండలం చెడ్వాయి గ్రామపంచాయతీలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు కార్యక్రమాన్ని పశువైద్యాధికారి రాజేశ్, సర్పంచ్ శ్రీనివాస్ కలిసి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ గేదెలకు టీకాలు వేయించాలని కోరారు.