KRNL: దేవనకొండ గ్రామపంచాయతీ పరిధిలోని బండ్లమెట్ట, కామేలా, సంత మార్కెట్ స్థలాలకు ఇవాళ వేలం పాట నిర్వహించనున్నట్లు కార్యదర్శి రాముడు తెలిపారు. ఆసక్తి గలవారు నిర్ణీత డిపాజిట్ చెల్లించి పాల్గొనవచ్చన్నారు. బండ్లమెట్టకు రూ.2.50 లక్షలు, కామేలకు రూ.50 వేల, సంత మార్కెట్‌కు రూ.1.50 లక్షలు డిపాజిట్‌గా నిర్ణయించారు. నిబంధనల మేరకు వేలం జరుగుతుందని వెల్లడించారు.