NRML: జిల్లా కేంద్రంలో ఇవాళ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పట్టణంలోని ఆయా దుకాణ సముదాయాలు, వివిధ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బందుకు మద్దతు తెలిపారు. దీంతో పట్టణం నిర్మానుష్యంగా మారింది. బీజేపీ నాయకులు ద్విచక్ర వాహనాలపై వెళ్తూ వ్యాపార సంస్థలను బందు చేయాలని కోరారు.