JGL: ప్రభుత్వం పేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు ఒక వరమని ఏఎంసీ ఛైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బైర లక్ష్మి రాజయ్య దంపతులు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన ఇల్లు పూర్తి చేసుకుని గృహప్రవేశంలో సర్పంచ్ ఒరుగుల అరుణ శ్రీనివాస్‌తో కలిసి ఏఎంసీ ఛైర్మన్ ప్రారంభించారు.