ASF: ఇసుక సరఫరా పారదర్శకంగా జరిగేందుకు రూపొందించిన ‘మన ఇసుక వాహనం’ ఆన్లైన్ బుకింగ్ సర్వీస్‌ను బుధవారం కలెక్టర్ హరిత ఆసిఫాబాద్ MRO కార్యాలయంలో ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి ఈ సర్వీస్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఆన్లైన్ సర్వీస్ వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో కూపన్లను ఎక్కడ జారీ చేయవద్దని కలెక్టర్ సూచించారు.