BHPL: మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామంకు చెందిన గంగుల రాదక్క (54) బుధవారం ఇంటి పనులు చేస్తుండగా పాము కాటుకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక PHCకి తరలించగా, అక్కడ వైద్య సిబ్బంది, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనంలో మంథని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో గోదావరిఖని తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది.