జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వల్ల శరీరంలో ఇన్సులిన్ పెరిగి మొటిమలు వస్తాయి. దీనివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి బ్యాక్టీరియా చేరుతుంది. అందుకే మైదా వస్తువులకు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా చేపలు, వాల్నట్స్, ఆకుకూరలు, క్యారెట్లు వంటి పౌష్టికాహారం తీసుకోవాలి. ఇలా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.