BDK: జిల్లాలో సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో ‘మీ సేవ’ ఆన్లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనున్నట్లు ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరావు తెలిపారు. ఈనెల 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు సర్వర్ నిర్వహణ పనులు కొనసాగనున్నట్లు వెల్లడించారు. సర్వర్ పనితీరు మెరుగుదల, సాంకేతిక సమస్యల నివారణ కోసం నిలిపివేస్తున్నట్లు తెలిపారు.