ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న అధికారుల నివాస సముదాయం పనులను జిల్లా కలెక్టర్ కె. హరిత బుధవారం పరిశీలించారు. పనులు నత్తనడకన సాగుతుండటంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతలో రాజీ పడకుండా, పెండింగ్ పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి అధికారులకు నివాసయోగ్యంగా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.