హీరోయిన్ మాళవిక నాయర్ నటించిన తాజా చిత్రం ‘బైకర్’ ఈ నెల 3న విడుదల కానుంది. ఇందులో శర్వానంద్‌కు జోడీగా ఆమె నటించింది. ఈ సినిమాలో తన పాత్ర ఒక వారధిలా ఉంటుందని, ఓ క్రీడాకారుడి జీవితంలో భాగస్వామి పాత్ర ఎంత కీలకమో తన పాత్ర ద్వారా తెలుస్తుందని ఆమె పేర్కొంది. మూడు కాలాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని మాళవిక ధీమా వ్యక్తం చేసింది.