తిరుపతి రూరల్ గాంధీపురంలో భారీ చోరీ జరిగింది. స్థానికుడు లోకేశ్ ఈ నెల 30న పాకాల మండలం బత్తినవారిపల్లిలోని తన స్వగ్రామానికి వెళ్లారు. దీన్ని అదనుగా చూసుకున్న దుండగులు తాళం వేసి ఉన్న ఆయన ఇంట్లోకి చొరబడి బీరువాలో భద్రపరిచిన రూ.6.20 లక్షల నగదు దోచుకెళ్లారు. తిరిగి వచ్చిన లోకేశ్ చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.