గుంటూరు: వైద్య కళాశాలకు నెఫ్రాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్సులో రెండు సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చింది. జీజీహెచ్లో కిడ్నీ చికిత్సలు, డయాలసిస్ సేవలు విస్తృతంగా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల పెంపుకు ప్రతిపాదనలు పంపారు. పరిశీలన అనంతరం 2025-26 విద్యా సంవత్సరానికి రెండు సీట్లు కేటాయించారు.