జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో గురువారం బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి వేడుకలను కల్లు గీతా కార్మిక సంఘం సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. సంఘం మండలాధ్యక్షుడు బసవగాని మహేందర్ గౌడ్ పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య, గౌడ సంఘం నేతలు పాల్గొన్నారు.