NLR: నెల్లూరు నగరంలోని సౌత్ స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వయసు 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి తెలుపు రంగు షర్ట్, బంగారం అంచుతో కూడిన తెలుపు పంచ ధరించినట్లు గుర్తించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెళ్లడించారు.